లెజెండ్ పీవీ
లెజెండ్ పీవీ రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడు బహుభాషా కోవిదుడు వరంగల్, కరీంనగర్ జిల్లాలతో అనుబంధం 2021 జూన్ 28 వరకు శత జయంతి వేడుకలు నిర్వహించనున్న తెలంగాణ ప్రభుత్వం పీవీకి భారతరత్న ఇవ్వాలి : కేసీఆర్ పీవీ మహా సముద్రమంలాంటి వాడు.. సముద్రంలా పైకి ప్రశాంతంగా కన్పించినా అతడి అంతర్మథనంలో కోటానుకోట్ల ఉప్పెనల శక్తి దాగి ఉన్న ఒక మహోన్నత రాజకీయ, సాహిత్య యోధుడు. అలాంటి వ్యక్తిని భరత జాతికి సగర్వంగా అందించింది మన తెలంగాణ గడ్డ. ముందుచూపుతో ఆనాడు పీవీ అమలుచేసిన సంస్కరణల ఫలితంగా నేడు మన దేశం అనేక రంగాల్లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. భారతదేశాన్ని పరిపాలించిన అందరి ప్రధానుల్లో ఒక భిన్నమైన రాజకీయ, పరిపాలన చతురతను అవలంభించిన వ్యక్తిగా పీవీని పేర్కొనవచ్చు. మౌనంగా చూసే చూపుల్లో వేలాది భావాలను ప్రసరింపజేయగల మహా తత్వవేత్త. యావత్ భారతదేశం గర్వించదగిన మన తెలుగు బిడ్డ పీవీ. రాష్ట్ర, దేశ రాజకీయాలలో పీవీ వేసిన ముద్ర ప్రత్యేకమైనది. తెలంగాణలోని వరంగల్ జిల్లా, నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28 న రుక్నాబాయి, సీతారామరావు దంపతులకు పీవీ జన్మించాడ...