సమరానికి సై...
సమరానికి సై...
భరత్ ను తక్కువ అంచనా వేస్తున్న చైనా
చైనాతో తలపడేందుకు భారత్ సిద్ధం
1962తో పోల్చుకుంటున్న డ్రాగన్
అప్పటి పరిస్థితిలో లేమంటున్న భరత్
అనేక సమస్యలతో సతమతమవుతున్న భారత దేశంఫై ఇదే అదనుగా చొరబాట్లకు పాల్పడాలనే దుర్బుద్ధితో వుంది చైనా. గత ఐదారు నెలలుగా భారత దేశంలో కరోనా సృష్టిస్తున్న బీభత్స౦ కారణంగా దేశం చాలా క్లిష్ట పరిస్థితులలో వున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా లక్డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అన్ని రంగాలఫై దీని ప్రభావం అంత ఇంత కాదు. ఎంతో మంది ఉపాధి కోల్పోగా మరెన్నో కంపెనీలు మూతపడ్డాయి. ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పడిపోయింది. అయితే ఈ పరిస్థితులలో దేశ౦లోని వ్యవస్థలన్నీ కరొనను అంతం చేయడంతో పాటు ఆర్థిక వ్యవస్థను గాడిన పడేసే చర్యలు, ఇతర అనేక విషయాలఫై దృష్టి సారించాయి. ఇలాంటి అంతర్గత సమస్యలతో భారత్ బలహీన పడి ఉండవచ్చని చైనా భావిస్తూ ఇదే అదనుగా చాపకింద నీరులా భారత భూభాగాన్ని కబళించే ప్రయత్నం చేస్తోంది.
భరత్ ను తక్కువ అంచనా వేస్తున్న చైనా
భారత దేశాన్ని చైనా తక్కువ అంచనా వేస్తోంది. 1962లో జరిగిన భారత-చైనా యుద్ధంలో భారత దేశం ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కుడా యుద్ధం సంభవిస్తే తమదే పైచేయి అవుతుందని చైనా నమ్ముతోంది. కానీ చైనా ఊహిస్తున్నట్టు పరిస్థితి అంత తేలికగా లేదు.
1962 యుద్ధంలో భరత్ ఓడిపోవడానికి కారణాలు
స్వాతంత్ర్యం వచ్చిన చాలా ఏళ్ల వరకు దేశ పాలకులు సరిహద్దుల భద్రతపై అనుసరించిన ఉదాసీన వైఖరికి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఓ వైపు దేశ విభజన మరోవైపు స్వదేశీ సంస్థానాల విలీనం, దేశంలో అంతర్గత భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, వ్యవసాయాభివృద్ధి, నీటిపారుదల సదుపాయాల కల్పన, పాలనపై పట్టు సాధించడం వంటి అంశాలపైనే దృష్టికేంద్రీకరించడంతో సైన్యంలో అప్రమత్తత కొరవడింది. ఇక స్వతంత్ర భారత ఆవిర్భావంతో లక్ష్యాన్ని సాధించినట్లేననుకున్న పాలకుల భావన తర్వాతి కాలంలో కష్టాలను తెచ్చిపెట్టింది. ఇక బ్రిటిష్ కాలం నాటి ఆయుధాలతో ఏర్పడ్డ భారత సైన్యం ఆయుధ సంపత్తిని స్వదేశీ పాలనలో ఆధునీకరించుకోలేకపోవడం సమస్యలకు కారణమైంది. అదే సమయంలో భారత భూభాగాలపై కన్నేసిన చైనా సైన్యాన్ని తరలించడానికి వీలుగా ఏర్పాట్లు చేసుకుంది. నిఘా వ్యవస్థ పటిష్ఠంగా లేకపోవడం, ఈశాన్య భారతంలో ఏం జరుగుతుందో గుర్తించేలోపే చైనా పనులు చక్కబెట్టేసింది. జమ్మూ కశ్మీర్లో భాగమైన అక్సాయ్‌చిన్‌లో 38వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించి, భారత నిఘా వ్యవస్థలకు తెలియకుండా ఝింజియాంగ్-టిబెట్ల మధ్య సైన్యాన్ని తరలించడానికి ఏకంగా హైవేనే నిర్మించేసింది. 1957లో చైనా అధికారికంగా ప్రకటించే వరకు హైవే నిర్మాణ పనుల్ని కూడా గుర్తించలేకపోయారు. ఆయా కారణాలతో భరత్ ఫై చైనా గెలువగలిగింది.
చైనా దురాక్రమణకు భారత సైన్యం, నాయకత్వ వైఫల్యాలు కూడా కారణాలే......రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న భారత్ చైనా నుంచి ఊహించని దాడిని ఎదుర్కొవాల్సి వచ్చింది. ఉపఖండంలో తనకు ప్రధాన ప్రత్యర్థిగా భారత్‌ను భావించిన చైనా మొదట్లోనే కట్టడి చేయాలని భావించింది. అందుకు దేశ భద్రతపై దార్శనికత కొరవడిన భారత పాలకుల వైఫల్యం కలిసొచ్చింది. కాలం చెల్లిన ఆయుధాలతో ఆధునీకరణ కోసం ఎదురుచూస్తోన్న భారత సైన్యం చైనాతో బలవంతపు యుద్ధానికి దిగాల్సి వచ్చింది. దీనికితోడు చైనా దురాక్రమణ విషయంలో నాటి ప్రధాని నెహ్రూ, రక్షణ మంత్రి కృష్ణ మీనన్, సైనిక కమాండర్లు అనుసరించిన వ్యూహాలపై కూడా రకరకాల కథనాలు ప్రచారం ఉన్నాయి. సకాలంలో కఠిన నిర్ణయాలు తీసుకోలేకపోవడం భారత్‌కు శాపంగా పరిణమించిందని భారత్-చైనా యుధ్ధంపై నివేదిక సమర్పించిన జనరల్ హెండర్సన్-బ్రూక్స్, బ్రిగేడియర్ పిఎస్‌ల నివేదికల్లో తప్పుపట్టడం కూడా వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుంది.
ప్రస్తుత పరిస్థితులలో యుద్ధం వస్తే...
అయితే ప్రస్తుత పరిస్థుతుల్లో భరత్-చైనా ల మధ్య యుద్ధం సంభవిస్తే భరత్ అంత శక్తి హీనంగా ఏమి లేదు. భారత త్రివిధ దళాలు 60లతో పోల్చితే అనేక విషయాలలో ఆధునికతతో పాటు చాల శక్తి వంతంగా తయారయ్యాయి. భారత్ తో పోల్చితే చైనా కొన్ని అంశాలలో శక్తి వంతంగా ఉన్నప్పటికీ చైనా సైనికులను భారత్ ధీటుగా ఎదుర్కోగలదు. భారత వాయు సేన చైనా కంటే చురుకైనది. ఇరు దేశాలు దాదాపు బలగాల పరంగా సమఉజ్జిలుగా ఉండడం వల్ల ఇరువైపుల ప్రాణ నష్టం అధికంగానే ఉండవచ్చు. ఇకపోతే ఇటీవల రాఫెల్ యుద్ధ విమానాల రాకతో భారత సైనికుల్లో మరింత ఆత్మ విశ్వాసం పెరిగిందనే చెప్పవచ్చు. వున్న టెక్నాలజీ, కమ్యూనికేషన్ వ్యవస్థ, సైనిక బలగాలను సరైన రీతిలో ఉపయోగించుకుంటే చైనాఫై భారత్ పైచేయి సాధించవచ్చు.
- వల్లంపట్ల కృష్ణాకర్
డెస్క్ జర్నలిస్ట్

Good
ReplyDeleteThankyou...
DeleteThankyou...
Deletesupwr
ReplyDeleteThankyou...
Delete