అక్షరాలతో గూడు కట్టాలని
ఒక సంధ్యా సమయాన
కడలి తీరాన్ని వెతుక్కుoటూ వెళ్లా
గూడు రూపుదిద్దుకుంటుండగా
గాలి బీభత్సం
అక్షరాలన్నీ  చెల్లాచెదురై
ఎక్కడెక్కడనో ఎగిరిపడినై

అక్షరాలను వెతుక్కుంటూ
ఎక్కడెక్కడనో పయనించా
కడలి అంచునా.. కడలి లోపలా
చివరకు అక్షరాలను మూటకట్టి
రాశిగా పోశా

మళ్ళీ ఆరంభించా గూడు కట్టడం..
ఈసారి బుసలు కొడుతూ పెను సునామీ
అక్షరాలు విలవిల లాడినై
ముక్కలు ముక్కలుగా పగిలినయ్
అక్షర శిథిలాల కింద నేను
నిస్సహాయంగా చూస్తూ..
కడలి కెరటాల సాక్షిగా
ఒక కొత్త లిపిని లిఖించి
సరికొత్త భాష ను
సృష్టించాలనుకున్నా..

-వల్లంపట్ల క్రిష్ణాకర్

Comments

Popular posts from this blog

అపురూప శిల్ప కావ్యాలు 'గణపురం కోటగుళ్లు'

ప్రకృతి గీసిన చిత్రం ఏటూరునాగారం అభయారణ్యం

బాలు లోటును భర్తీచేసేదెవరు